Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బింబిసార 2'లో పవర్ఫుల్ లేడీ విలన్!

Bimbisara 2 movie update
  • భారీ విజయాన్ని సాధించిన 'బింబిసార'
  • సీక్వెల్ కోసం జరుగుతున్న సన్నాహాలు 
  • రెట్టింపు బడ్జెట్ ను కేటాయించిన కల్యాణ్ రామ్
  • వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలు  
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన 'బింబిసార' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ కూడా ఈ సినిమా ఒక రేంజ్ లో సందడి చేస్తుందని భావిస్తున్నారు. 

ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని కల్యాణ్ రామ్ చెప్పేశాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని అంటున్నారు. 'బింబిసార 2'ను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. మొదటి భాగాన్ని 40 కోట్లతో నిర్మించగా, 2వ భాగానికిగాను అంతకు రెట్టింపు బడ్జెట్ ను కేటాయించినట్టు సమాచారం. 

ఈ సినిమాలో లేడీ విలన్ రోల్ ను పవర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. ఆ పాత్రకి గాను బాగా క్రేజ్ ఉన్న ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నారని చెబుతున్నారు. ఏ స్టార్ హీరోయిన్ ను తీసుకోవచ్చు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు.
Kalyanram
Samyuktha Menon
Bimbisara Movie 2

More Telugu News